‘నిజమే నే చెబుతున్నా‘ పాట యొక్క లిరిక్స్‌ను (Nijame Ne Chebutunna Lyrics) ఈ పోస్ట్‌లో అందించడం జరింగింది. ఇది 2024లో విడుదలైన ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) అనే తెలుగు సినిమాలోని పాట. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, దీనిని వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రంలో సుందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయనకు సహ నటులుగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, హర్ష, పి.రవిశంకర్ తదితరులు కనిపించనున్నారు.
ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటంటే, ఓ ఇంట్లో బంగారు నగలు దొంగిలించిన తర్వాత, బసవ (సుందీప్ కిషన్), అతని స్నేహితుడు జాన్ (వైవా హర్ష), మరియు మరో దొంగ గీత (కావ్య థాపర్) పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా భైరవకోన అనే రహస్యమైన గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రామం గురించి ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది, అది ఏమిటంటే ఒకసారి ఆ ఊరిలోకి వెళ్లినవారు సజీవంగా తిరిగి రావడం చాలా అరుదు అని. భయంతో, తమ ప్రాణాలు దక్కించుకోవడానికి వారు గ్రామం నుండి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఇంతలో, వారి బ్యాగ్ గ్రామంలోని ఒక గ్యాంగ్ చేతిలో దొంగిలించబడుతుంది. ఆ బ్యాగ్ తిరిగి పొందడానికి బసవ చేసిన ప్రయత్నాల్లో ఏ విధమైన కష్టాలను ఏ విధంగా ఎదుర్కొన్నారో మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సందీప్ కిషన్ కు గత కొంతకాలంగా ఒక్క హిట్ సినిమా కూడా తగల్లేదు. తను ఎంచుకునే కథలలో తేడా ఉందా లేదా తన నటనలో వైవిద్యం మిస్ అయ్యిందా తెలీదు కాని, హిట్ సినిమాలకు దూరం అవుతున్నాడు. ముఖ్యంగా మన టాలీవుడ్ అందరు హీరోలు తాము మేన్ లీడ్ ఉంటేనే సినిమాలకు ఒప్పకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం అది ఎవరి సినిమా అయిన పర్లేదు, హీరో ఎవ్వరైన పర్లేదు మంచి క్యారెక్టర్ ఉంది అనిపిస్తే ఆ సినిమాలలో నటించడానికి సంకోసించరు. అలాంటి వారిలో సందిప్ కిషన్ కూడా ముందుంటాడు.
ఈయన నటుడిగా తెరపైకి వచ్చింది 2010లో విడుదలైన ‘ప్రస్థానం’ సినిమా ద్వార. ఇందులో ‘చిన్న’ అనే క్యారెక్టర్ లో కనిపించాడు. ఇక మేన్ లీడ్ గా (హీరో గా) ‘స్నేహాగీతం (2010)’ సినిమాలో నటించాడు. సందీప్ తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో కూడా అడపదడప నటిస్తూ వస్తున్నాడు. ఈయన మొదటిసారిగా తమిళంలో ‘యారుడ మహేశ్ (2013)’ సినిమా ద్వారా మెచ్చించారు. అలా అప్పటి నుండి వేరే సినిమాలలో అది తెలుగైన, తమిళం అయిన మంచి క్యారెక్టర్ ఉంది అనిపిస్తే సైడ్ క్యారెక్టర్ లలో నటిస్తూ వస్తున్నాడు. ఈ ఊరిపేరు బైరవకోన సినిమాలో సందీప్ కిషన్ నటన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. ఈయన మ్యూజిక్ కంపోజర్ గానే కాకుండా, గాయకుడిగా కూడా ప్రసిద్ది చెందారు. ఇతను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు గారి కొడుకు. హరి అనుమోలు తెలుగులో విజయవంతమైన మయూరి, లేడిస్ టైగర్, నువ్వే కావాలి లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. రవిబాబు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనుసూయ (2007)’ సినిమా ద్వారా శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. తెలుగుతో పాటు కొన్ని తమిళ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారు.
నిజమే నే చెబుతున్నా పాటను రాసింది శ్రీమణి. ఈయన మన టాలీవుడ్ లో బిజీగా ఉన్న గేయరచయితలలో ఒకడు. అలాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. రొమాంటిక్ మరియు లవ్ పాటలు ఎక్కువగా సిద్ శ్రీరామ్ ను వెతుకుంటూ వస్తున్నాయి. అది ఆయన అదృష్టమో వింటున్నా ఆ పాటలు వినే మన అదృష్టమో తెలియదు కాని ఆ పాటలకు ఆయనైతేనే న్యాయం చేస్తాడు అనడంలో సందేహం లేదు. అది ఈ పాట ద్వారా కూడా తెలిసిపోతుంది. ‘నిజమే నే చెబుతున్నా’ పాట యొక్క సాహిత్యాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో క్రింద ఇవ్వడం జరిగింది.
పాట సమాచారం:
- పాట: నిజమే నే చెబుతున్నా
- సినిమా: Ooru Peru Bhairavakona (ఊరు పేరు భైరవకోన)
- నటీనటులు: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ
- సినిమా దర్శకుడు: వి.ఐ.ఆనంద్
- సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
- గేయరచయిత: శ్రీమణి
- గాయకుడు: సిద్ శ్రీరామ్
- సినిమా విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2024
- లేబుల్: ఆదిత్య మ్యూజిక్
Nijame Ne Chebutunna Song Lyrics in Telugu
తానానే నానానేనే
తానానే నానానే నానానేనా
తారారే రారారరే
నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్న
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దొచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా
తానారే రారారె రారారెనా
తారారె నానారెరే
తానారే నానారె తానారెనా
తారారే రారారరే
వెన్నెల తెలుసే నాకు
వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు
మాట తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే
కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న
పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా
మనసారా ఓ సైగే చాలంటున్నా
అడుగులతోటి దూరం కొలిచే కన్నా
దూరాన్ని గుర్తించని పయణం కానా
నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా
Nijame Ne Chebutunna Lyrics in English
Thaanaane NaanaaneNe
Thaanaane Naanaane Naanaanena
Thaaraare Raaraara Re
Nijame Ne Chebuthunna
Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna
Edhemaina
Naa Pranam Needhantunna
Vellake Vadilellake
Naa Gundeni Dochesilaa
Challake Vedha Jallake
Naa Chuttu Rangulnilaa
Thaanaare Raaraare RaaraaRena
Thaaraare NaanaareRe
Thaanaare Naanaare
ThaanaaRena
Thaaraare RaaraaraRe
Vennela Teluse Naaku
Varsham Teluse
Ninu Kalisaake
Vennela Varsham Teluse
Mounam Teluse Naaku
Maata Teluse
Mounamlo Dhaagunde
Maatalu Teluse
Kannultho Choosedhi Konchame
Gundello Lothe Kanipinchene
Paipaina Roopaalu Kaadhule
Lolopali Preme Choodaalile
Nijame Ne Chebuthunna
Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna
Edhemaina
Naa Pranam Needhantunna
Pedavulathoti Piliche
Pilupulakanna
Manasaara O Saige Chaalantunna
Adugulathoti Dhooram Kolichekanna
Dhooraanne Gurtinchani
Payanamkaana
Needalle Vasthaane Nee Jathai
Thodalle Untaane Nee Kathai
O Inupa Palakanti Gundepai
Kavithalni Raasaavu Devathai
Nijame Ne Chebuthunna
Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna
Edhemaina
Naa Pranam Needhantunna
నిజమే నే చెబుతున్నా Video Song
ఇంతకు ముందు అనేక ఆర్టికల్స్ మనం చెప్పుకున్నట్టుగా పెద్ద సినిమాలకైతే సూపర్ క్యాస్ట్ ఉంటుంది కాబట్టి అలాంటి సినిమాలకు ఆడియన్స్ లో బజ్ క్రియేట్ అవుతుంది. కానీ చిన్న సినిమాలకు బజ్ క్రియేట్ అవ్వడంలో సూపర్ క్యాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి, వాటిని నిజమే నే చెబుతున్నా లాంటి హిట్ పాటలు చాలా చాలా అవసరం. అలా అయితేనే అటువంటి సినిమాలకు ఎంతో కొంత బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో దాదాపు ఐదు పాటల వరకు ఉన్నట్టున్నాయి. వాటిలో ఈ నిజమే నే చెబుతున్నా పాట ఎంత పెద్ద హిట్ అయి ట్రెండింగ్ లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ పాట వల్ల ఊరుపేరు బైరవకోన అనే సినిమా ఒకటి ఉందని చాలా మందికి తెలిసి వచ్చింది. దీనికి చిత్రబృందం ఈ పాటకు సంగీతాన్ని అందించిన శేఖర్ చంద్రను, సాహిత్యం అందించిన శ్రీమణి గారిని, గాయకుడైన సిద్ శ్రీరామ్ గారిని అందరికంటే కొంచెం ఎక్కువ పొగడాలి. వారికి తగిన పారితోషకం ఇచ్చి వారిని గౌరవించాలని ఒక సంగీత ప్రియుడిగా నా విన్నపం.
ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణ వర్ష బొల్లమ్మ అనే చెప్పొచ్చు. అదేంట్రా నువ్ ప్రతీ పాటలో అమ్మాయిలో బాగున్నారు, ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు అనే చెబుతున్నావని, నేనేమో స్త్రీల పక్షపాతిగా తప్పుగా అనుకోకండి. బాగుందంటే బాగుందనే అంటాము కదా. వర్ష బొల్లమ్మ సినిమాలలో నాకు నచ్చిన సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడిస్ (2020)’. ఆ సినిమాలో ఆమె చాలా బబ్లీగా, మొద్దుగా, ముద్దుగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె గుండ్రని కళ్ళకి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పాటలో కూడా ఆమె కళ్ళ ద్వారా ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ మామూలుగా ఉండదు.
మన హీరో ఆమె గురించి పాట పాడుతూ, ఆమెను కొంచెం దొంగచాటుగా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఆమె అతన్ని చూస్తూ ఉంటుంది. అంతే పెద్ద పెద్ద డ్యాన్స్ మూవ్స్ లేవి ఉండవు. అరే అది డ్యాన్స్ చేసే పాట కాదుర, అది ఒక విధమైన రొమాంటిక్ తో కూడిన క్లాసిక్ ప్రేమ పాట అందులో డ్యాన్స్ ఏంట్రా అని మీరు అనొచ్చు అది కూడా నిజమే అనుకోండి. ఏదీ ఏమైన వినసొంపైన సిద్ శ్రీరామ్ వాయిస్, శేఖర్ చంద్ర యొక్క ఇంపైన సంగీతం, శ్రీమణి గారి అర్థమంతమైన తెలుగు పదాలతో కూడిన సాహిత్యం, వర్షబొల్లమ్మ స్క్రీన్ ప్రెజెన్స్ (సందీప్ కిషన్ కూడా) కలిగి ఈ పాట ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
Report a Lyrics Mistake / Share Your Thoughts